శ్రీ వేంకటేశ్వర స్వామి మీద భక్తితో అన్నమాచార్యులు పాడిన కీర్తనలు.....

Pages

Monday, July 12, 2010

పట్టినచోనే వెదకి

పట్టినచోనే వెదకి భావించవలెగాని గట్టిగా నంతర్యామి కరుణించును

యింటిలోనిచీకటే యిట్టే తప్పకచూచితే వెంటనే కొంతవడికి వెలుగిచ్చును
అంటి కానరాని తనయాతుమ తప్పకచూచు కొంటే దనయాతుమయు గొబ్బున గాన్పించును

మించి కఠినపురాతిమీద గడప వెట్టితే అంచెల దానే కుదురైనయట్టు
పొంచి హరినామమే యేపొద్దు నాలికతుదను యెంచి తలచదలచ నిరవౌ సుజ్ఞానము

వొక్కొక్కయడుగే వొగి ముందర బెట్టితే యెక్కువై కొండైనా నెక్కు గొనకు
యిక్కువ శ్రీవేంకటేశు నిటు దినదినమును పక్కన గొలిచితే బ్రహ్మపట్ట మెక్కును 

No comments:

Post a Comment