పట్టినదెల్లా బ్రహ్మము దట్టపుజడునికి దైవంబేలా
ఘనయాచకునకు కనకమే బ్రహ్మము తనువే బ్రహ్మము తరువలికి
యెనయు గాముకున కింతులే బ్రహ్మము తనలోవెలిగేటితత్త్వం బేలా
ఆకటివానికి నన్నమే బ్రహ్మము లోకమే బ్రహ్మము లోలునికి
కైకొని కర్మికి కాలమే బ్రహ్మము శ్రీకాంతునిపై జింతది యేలా
భువి సంసారికి పుత్రులె బ్రహ్మము నవ మిందరి కిది నడచేది
యివలను శ్రీవేంకటేశుదాసులకు భవ మతనికృపే బ్రహ్మము
No comments:
Post a Comment