పదిలము కోట పగవారు అదన గాచుకొందు రారుగురు
ఇమ్మై జెప్ప యిందరిచేత తొమ్మిదినెల్ల దోగినది
కొమ్మతీరున గుదురైనకోట దొమ్మికాండ్లైదుగు రుందురు
వొంటికాడు రాజు వుడుగక తమలోన వొంటనీనిమంత్రు లొకయిద్దరు
దంటతనంబున దమయిచ్చ దిరిగాడు బంటు లేడుగురు బలవంతులు
తెలిసి కొనేటితిమ్మినాయడు చొచ్చె బలిసె యీకోట భయమేల
No comments:
Post a Comment