పనిమాలినట్టి వట్టిపరదుగాక మాకు ననిచి యిదియు నొక్కనగుబాటా
కన్నవారినెల్లా వేడేకష్టమే దక్కుటగాక పన్ని దైవమియ్యనిది పరులిచ్చేరా
యెన్నికతో దేహమిచ్చె నిహమెల్లా జెందనిచ్చె వున్నవారింతటిపని కోపగలరా
బడలి తానెందైనా బడ్డపాటేదక్కెగాక కడగి రానిదిదే నొక్కరివసమా
కడుపులో నుండగానే కలవి నుదుట వ్రాసె తడవి దైవముచేత దాటవసమా
దెప్పరపుసంపదకు దిమ్మటలే దక్కెగాక యెప్పుడూ శ్రీవేంకటేశు డీకమానీనా
చప్పుడుగా నతనికే శరణన్న జాలుగాక తప్పులును వొప్పులు నాతనివేకావా
No comments:
Post a Comment