పనిలేనిధనవాంఛ బడిపొరలిన నిట్టి కనుమాయలేకాక కడ నేమిగలదు
కనుచూపుకాకల గలయట వెడయాస లనుభవింపుటగాక యందేమిగలదు
తనువల్లిసోకుల దగులుట మమతల నెనయగోరుటగాక యిందేమిగలదు
ఎలమి నధర మానుటెరిగి యెంగిలి నోర నలుముకొనుట గాక యందేమిగలదు
పలులంపటములచే బడుట దుఃఖంబులు తలజుట్టుటేకాక తనకేమి గలదు
శ్రీవేంకటాద్రీశు జేరనిపనులెల్ల నేవగింతలేకాక యిందేమిగలదు
ఆవల సురతభోగ మనుభవింపబోయి రావలయుటగాక రచనేమిగలదు
No comments:
Post a Comment