శ్రీ వేంకటేశ్వర స్వామి మీద భక్తితో అన్నమాచార్యులు పాడిన కీర్తనలు.....

Pages

Monday, July 12, 2010

పనివడి యింద్రియాలే

పనివడి యింద్రియాలే పరువులు వెట్టుగానీ ఎడయని చుట్టరికాలెవ్వరికీ లేవు

వన్నె సతుల రూపులు వారివద్దనె నుండగా కన్నులజూచే వారికి కళరేగును
ఎన్నివారి గుణాలెడ మాటలాడగాను విన్నవారికి వూరకేను వేడుకలుబుట్టు

అంతానింతా గమ్మవిరులు అంగళ్ళలో నుండగా సంత వారలూరకే వాసనగొందురు
బంతివారి కంచాలలో పలురుచు లుండగాను వింతవార లందుకుగా వెసనోరుదురు

వెరవిడి దేహాలు వేరె వుండగాను సురతాన సోకితేనే చొక్కుదురు
ఇరవై శ్రీ వేంకటేశు యిన్నిటికీ సూత్రధారి నరినితనీ దాసులు జడియరిందుకును

No comments:

Post a Comment