పరగీ నిదివో గద్దెపై సింహము వాడె పరమైన ఔభళనారసింహము
తెల్లనిమేనిసింహము దేవసింహము మెల్లని చిరునవ్వుల మేటిసింహము
చల్లేటి ఉరుపులతో జయసింహము వాడె బల్లిదుడైవెలసే ఔభళనారసింహము
నిలుచున్న సింహము నిత్య సింహము అలరు కొండలమీది అది సింహము
వెలుపలి కడపపై వీరసింహము పలుకు పంతముల ఔభళనారసింహము
పుట్ట జడల సింహము పూర్ణసింహము ఱట్టడి ఆర్పుల ఆఱడి సింహము
జట్టిగొన్న దాసులకు శాంతసింహము పట్టపు శ్రీవేంకట ఔభళనారసింహము
No comments:
Post a Comment