పరగుబహుజన్మ పరిపక్వహృదయుడై మరికదా వేదాంతమార్గంబు గనుట
కలుషహరమగు వివేకమ్ము గలిగినయట్టి ఫలముగాదా కృపాపారీణుడౌట
తలపోసి సకలభూతదయావిశేషంబు కలిగికదా గుణవికారంబు గనుట
యెదిరి దనవలెనె తా నెఱగనేర్చినఫలము అదిగదా ద్రవ్యమోహంబు గడచనుట
పదిలమగునాశానుభవము పాపినయట్టి తుదగదా తాను సంతోషంబు గనుట
రతిపరాఙ్ముఖ మహారాజ్యమబ్బినఫలము మతిగదా తాను కర్మత్యాగియౌట
తతితోడ ఫలపరిత్యాగిచిత్తవ్యాపి ధృతిగదా వేంకటాధిపుదాసుడౌట
No comments:
Post a Comment