పరదేశిపట్టణమున పదుగురునేగురు గూడుక పరగగ వరి చెడ నూదర బలిసినయట్లాయ
ఊరేలెడియత డలసత నూరకయుండగ నడుమల వారలు నిక్కపుగర్తలవలె నుండినగతిని
ధీరత చెడి తను జీవుడు దెలియగనేరక యుండిన ధారుణిలోపల దొంగల ధర్మాసనమాయ
వొడలంతంతకు జిక్కగ నుబ్బినరోగము సుఖమున కెడమియ్యక నానాటికి నేచినచందమున
తడబడువిజ్ఞానము గతిదప్పగ బలుపగుపట్నము కడుజెడగా మాలవాడ్ ఘన్మైనట్లాయ
పొసగగ నిది గని యధికుడు పుక్కటకాండ్ల నందరి బసమారిచి మొదలికర్త బాలించినగతిని పసగలతిరువేంకటగిరిపతి నాదేహపుబురి నీ వసమై వెన్నుకు బండ్లు వచ్చినయట్లాయ
No comments:
Post a Comment