శ్రీ వేంకటేశ్వర స్వామి మీద భక్తితో అన్నమాచార్యులు పాడిన కీర్తనలు.....

Pages

Monday, July 12, 2010

పరమ పురుష

పరమ పురుష హరి పరాత్పర పరరిపు భంజన పరిపూర్ణ నమో

కమలా పతి కమల నాభ కమలాసన వంద్య కమల హితానంత కోటి ఘన సముదయ తేజా
కమలామల పత్రనేత్ర కమలవైరి వర్ణగాత్ర కమలషట్క యోగీశ్వర హృదయతేహం నమో నమో

జలనిధి మధన జలనిధి బంధన జలధి మధ్య శయనా జలధి యంతర విహార మచ్ఛకచ్ఛప యవతారా
జలనిధి జామాత జలనిధి శోషణ జలనిధి సప్తకగమన జలనిధి కారుణ్య నమో తేహం జలనిధి గంభీర నమో నమో

నగధర నగరిపు నందిత నగచర యూథపనాథా నగ పారిజాత హర సారస పన్నగ పతిరాజ శయనా
నగకుల విజయ శ్రీ వేంకట నగ నాయక భక్త విధేయా నగధీరాహంతే సర్వేశ్వర నారాయణ నమో నమో

No comments:

Post a Comment