శ్రీ వేంకటేశ్వర స్వామి మీద భక్తితో అన్నమాచార్యులు పాడిన కీర్తనలు.....

Pages

Thursday, July 29, 2010

విరహ మొక్కందమాయ

విరహ మొక్కందమాయ విచ్చేయవయ్యా నిరతి నాకెజూచి నీవంటా మొక్కితిమి

చెక్కిటిచెయ్యే చెలికి శేశపరియంకమాయ జక్కవ చన్నులు శంఖ్హచక్రములాయ
వుక్క చెమటే జలధివునికి సేసుక నిన్ను జక్కని సతి దలచి సారూప్యమందె

చలువ కస్తూరి పూత సరినీలవర్ణమాయ మెలుత నివ్వెర గనిమిశద్రిశ్టాయ
తొలుత చిగురు పాన్పు తులసి పూజాయ నిన్ను జలజాఖ్శి తలపోసి సారూపు మందె 

సిరులగట్టిన తాళి శ్రీధరభావమాయ వరుస వలపు భక్తవత్సలమాయ
యిరవై శ్రీవేంకటేశ యింతలో నీవుగూడగా సరుసనిన్నంటి వాకె సారూప్యమందె

No comments:

Post a Comment