శ్రీ వేంకటేశ్వర స్వామి మీద భక్తితో అన్నమాచార్యులు పాడిన కీర్తనలు.....

Pages

Thursday, July 29, 2010

విభుడ వింతటికి

విభుడ వింతటికి వెరపుతో ననుగావు అభయహస్తముతోడి ఆదిమూలమా

పలులంపటాలచేత బాతువడి పాటువడి అలసితి గావవే వో ఆదిమూలమా
చలమరి యితరసంసారభ్రాంతి జిక్కితి నన్నలరించి కావవే వో ఆదిమూలమా

యెంతకైనా నాసలచే యేగేగి వేసరితి నంత కోప గావవే వో ఆదిమూలమా
సంతలచుట్టరికాల జడిసితి నిక గావు అంతరాత్మ నాపాలిఆదిమూలమా

రంటదెప్పుటింద్రియాల రవ్వైతి గావవే వో అంటినశ్రీవేంకటాద్రి ఆదిమూలమా
గెంటక ముమ్మాటికిని నీకే శరణంటి గావవే వో ఆదిమూలమా

No comments:

Post a Comment