తానే కాకెవ్వరు మాకు దాతయు దైవము తనలోన బెట్టుకొని మాకు లోనైనవాడు
చదివించి కూడువెట్టి జారకుండ నిల్లుగట్టి బెదురులేని బుద్ధి పిన్ననాడే చెప్పి
యెదిరి నడిగి ద్రవ్యమిది గొమ్మనుచు నిచ్చి పదిలమై తమ్ము బాలించినవాడు
మోహవియోగమ్ము మోహానురాగమ్ము దేహవిభాగంబు దెలిపిన కలికి
ఐహికమున వేంకటాధీశుడై సర్వ దేహరక్షకుడై తిరుగుచున్నాడు
No comments:
Post a Comment