తానే తెలియవలె తలచి దేహి తన్ను మానుపువారలు మరి వేరీ
కడలేనిభవసాగరము చొచ్చినతన్ను వెడలించువారలు వేరీ
కడుబంధములచేత గట్టుపడినతన్ను విడిపించువారలు వేరీ
కాగినినుమువంటి కర్మపుతలమోపు వేగు దించేటివారు వేరీ
మూగినమోహపుమూకలు తొడిబడ వీగదోలేటి వారలువేరీ
తిరువేంకటాచలాధిపుని గొలువుమని వెరవుచెప్పెడువారు వేరీ
పరివోనిదురితకూపముల బడకుమని వెరవుచెప్పెడివారు వేరీ
No comments:
Post a Comment