శ్రీ వేంకటేశ్వర స్వామి మీద భక్తితో అన్నమాచార్యులు పాడిన కీర్తనలు.....

Pages

Friday, June 11, 2010

తాపలేక మేడ

తాపలేక మేడ లెక్కదలచేము యేపులేని చిత్తముతో యీహీహీ నేము

ఎఱుకమాలినబుద్ధి నెవ్వరైనా బతులంటా తెఱగెఱగక వీధి దిరిగేము
పఱచైన జవరాలు పరులెల్లా మగలంటా వొఱపునిలిపిన ట్లోహోహో నేము

యిందరును హితులంటూ యెందైనా సుఖమంటా పొందలేనిబాధ బొరలేము
మందమతివాడు యెండమావులు చెరువులంటా అందునిందు దిరిగిన ట్లాహాహా నేము

మేటివేంకటేశు బాసి మీదమీద జవులంటా నాటకపుతెరువుల నడిచేము
గూటిలో దవ్వులవాడు కొండలెల్ల నునుపంటా యేటవెట్టి యేగిన ట్లీహీహీ నేము

No comments:

Post a Comment