తాము స్వతంత్రులు గారు తమయంతను ఆమీదటిగురి ఆది నీవు
యెలమి స్వర్గమేలేటీంద్రునికినైనాను అలమి కోరేటిఫల మది నీవు
బలిమి గైలాసమేలేపతిరుద్రునికినైనా నిలుకడైనపదము నీపదము
యెక్కుడు సత్యలోకము యేలేబ్రహ్మకునైనా ఇక్కువ జేరేచోటు యెందును నీవు
వెక్కసపుబుణ్యముల వేదములకైనాను అక్కరతో ముఖ్యమైన అర్థమెల్లా నీవు
నాడు నాడే ముక్తులైన నారదళుకాదులకు నేడును విహరించేనెలవు నీవు
పోడిమి శ్రీవేంకటేశ పోలించ నెవ్వరూ లేరు మూడులోకముల నీవే మూలము నీవే
No comments:
Post a Comment