తారకబ్రహ్మము తానైవున్నాడు ధారుణిలో చెలువొందె దశరథరముడు
కొండలంతలు వానరకోటులు కొలువగాను దండితో కొలువున్నాడు తగరాముడు
అండనే సీతాదేవి అమరి కూచుండగాను మెండుగ సింహాసనాన మెరసీ రాముడు
వామదేవ కౌశిక వశిష్ఠాదుల విన్నపాలు ఆముకొని వినుచున్నాడు అదె రాముడు
గోమున భరత శత్రుఘ్నులు ఛత్రచామరాలు కామించి పట్టుకుండగా కడుమించే రాముడు
కనక పుష్పకము చెంగట వీరాసనము తో ననిచి ఆనందాన నున్నాడు రాముడు
ఘన శ్రీ వేంకటాద్రిపై కల్పవృక్షము నీడ హనుమంతుని చదువులాలకించీ రాముడు
No comments:
Post a Comment