తారుకాణ సేసుకొంటే తనే నేను ఈ రీతి నవ్వుగానీ ఇంటికి రమ్మనవే
చెక్కులివె చెమరించె చిత్తమెల్లా జిగిరించె కుక్కినట్టు కోరికలు కొనసాగెను
తొక్కినాడు నా పాపము తొలుతే సందడిలోన యెక్కడ పరాకుసేసీ నింటికి రమ్మనవే
దప్పిదేరె పెదవుల తమకము దైవారె కొప్పవీది చన్నులపై కుప్పలాయను
ముప్పిరిగా గట్టినాడు ముంజేతకంకణము ఈప్పుడేలనించీ సిగ్గులు ఈమ్టికి రమ్మనే
ఆయాలంటి నన్నుగూడె అంగమెల్లా బులకించె చేఇచేఇ సోకె యాసచిమ్మిరేగెను
చాయలా సన్నలా సేసెచల్లె శ్రీ వేంకటేశుడు ఈ యెడ నన్ను మన్నించీ ఇంటికి రమ్మనవే
No comments:
Post a Comment