శ్రీ వేంకటేశ్వర స్వామి మీద భక్తితో అన్నమాచార్యులు పాడిన కీర్తనలు.....

Pages

Friday, June 11, 2010

తినరాని కొనరాని

తినరాని కొనరాని దేవలోకపుబండు మనసున దలచితే మరగించే పండు

పంటకెక్కి పాలవెల్లి బండిన పాలపండు తొంటి గొల్లెతల మోవి దొండపండు
అంటుకొన్న మేనిచాయ అల్లు నేరేడుబండు ముంటి సింహపుగోళ్ళ ముండ్లపండు

ఇచ్చల వేదశాస్త్రాలు దెచ్చిన పేరీతపండు తచ్చిన దైత్యమారి దేవదారుబండు
పచ్చిదేర మెరసిన బండి గురువిందపండు యిచ్చవలెనన్న వారియింట నంటిపండు

తెమ్మగా మునులపాలి తియ్యని చింతపండు తిమ్మల సిరివలపు దేనెపండు
యిమ్ముల శ్రీ వేంకటాద్రి నింటినింట ముంగిటిపండు కొమ్మల పదారువేల గొప్ప మామిడిపండు

No comments:

Post a Comment