శ్రీ వేంకటేశ్వర స్వామి మీద భక్తితో అన్నమాచార్యులు పాడిన కీర్తనలు.....

Pages

Thursday, June 10, 2010

చెప్పినంతపని

చెప్పినంతపని నేజేయగలవాడ నింతే అప్పటి నపరాధమా ఆదరించవలదా

నీయాజ్ఞ దేహము నేమోచితి నింతే యీయెడ విజ్ఞానమేల యియ్యవయ్యా
వేయివేలై వేగుదాకా వెట్టిసేసి యలసితి వొయ్యన కొంతైన వూరడించ వలదా

నీవుసేసే కర్మము నేజేయువాడ నింతే యీవల నానాందసుఖ మియ్యవయ్యా
కోవరమై వెంటవెంట గొలిచినబంట్లకు తావుల గొంతవడైనా దప్పిదీర్చవలదా

మతిలో శ్రీవేంకటేశ మనికైనవాడ నింతే తతి నాపాటుకు దయదలచవయ్యా
యితవై పనిసేసేటి యింటిపసురమునకు వెతదీర్చ బాలార్చి వెడ్డువెట్టదగదా

No comments:

Post a Comment